హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా హీరోయిన్లు వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటేనే కెరీర్‌లో మరింత ముందుకు సాగే అవకాశాలుంటాయి. అలాంటిది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఎందుకిలా చేస్తోందో అస్సలు అర్దం కావడం లేదు.
ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ ఏది పట్టుకున్నా, మట్టే అవుతోంది. భారీ అంచనాలతో వచ్చిన 'అజ్ఞాతవాసి' అడ్రస్ లేకుండా పోవడంతో, అమ్మడి కెరీర్ టర్న్ అయిపోయింది. తర్వాత వచ్చిన 'నా పేరు సూర్య' అయినా అనూకి ఊరటనిస్తుందేమో అనుకుంటే అది కూడా అంతంత మాత్రంగానే నిలిచింది. దీంతో టోటల్‌గా స్టార్ హీరోలు అనూకి కలిసి రాలేదేమో అని చెప్పాల్సి వస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో రవితేజతో సినిమా నుండి తప్పుకుని మరోసారి షాకిచ్చింది అనూ ఇమ్మాన్యుయేల్.
డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగానే ఈ సినిమా నుండి తప్పుకున్నానని అను చెబుతున్నా, ఆ రీజన్ అంత కన్విన్సింగ్‌గా లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చైతూతో 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం ఒక్కటే ఉంది. వరుసపెట్టి నాలుగైదు సినిమాల్లో నటించే ఫ్లెక్సిబులిటీ హీరోయిన్స్‌కి ఉంటుంది. అలాంటిది అనూ ఎందుకిలా తప్పించుకుంటోందోనని తలలు పట్టుకుంటున్నారు ఆమె అభిమానులు.
మొత్తానికి తక్కువ టైంలోనే ఎంతగా క్రేజ్ సంపాదించుకుందో అలాగే అంత బోర్ కొట్టించేస్తోందిప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్. ఇలాగే చేస్తే అనూ కెరీర్ త్వరలోనే క్లోజ్ అయిపోయే అవకాశాలు లేకపోలేవు. మరోవైపు, రవితేజతో అనూ మిస్ చేసుకున్న ప్లేస్‌లోకి ముద్దుగుమ్మ శృతిహాసన్ వచ్చి చేరింది. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం.