'చినబాబు'కి తోడొస్తున్న పెదబాబు

మరిన్ని వార్తలు

సూర్య, కార్తీ ఈ అన్నదమ్ములిద్దరూ తమిళంలో స్టార్‌ హీరోలే అయినప్పటికీ, తెలుగులోనూ మంచి మార్కెట్‌ సంపాదించుకున్నారు. యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు సూర్య. ఆయన నటించిన 'సింగం' సిరీస్‌ తెలుగులో మంచి సక్సెస్‌ అందుకున్నాయి. ఇకపోతే సూర్య కన్నా వెనకొచ్చిన కార్తి డైరెక్ట్‌ తెలుగు సినిమాలో నటించి శభాష్‌ అనిపించుకున్నాడు.

కార్తీ నటించిన తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇకపోతే కార్తి లేటెస్ట్‌ మూవీ 'చినబాబు' వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్‌ అప్‌డేట్‌ ఏంటంటే ఈ సినిమాలో కార్తీతో అన్నయ్య సూర్య స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడట.

కార్తీ రైతు పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో సూర్య ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. కార్తీ గత చిత్రాల సక్సెస్‌ నేపథ్యంలో ఈ సినిమాపై తెలుగులోనూ అంచనాలున్నాయి. అంతేకాదు, ఈ సినిమాతో 'అఖిల్‌' బ్యూటీ సాయేషా సైగల్‌ తెలుగు ప్రేక్షకుల్ని మళ్లీ పలకరించబోతోంది. అఖిల్‌ పరాజయంతో తెలుగులో మరో సినిమా చేసే అవకాశం రాలేదీ బ్యూటీకి.

ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత ఆ అవకాశం కార్తి ద్వారా లభించింది సాయేషాకి. చూడాలి ఈ సినిమాతోనైనా అమ్మడు తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందేమో. పాండిరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS