కార్తీ చినబాబు రిలీజ్ వివరాలు

By iQlikMovies - June 14, 2018 - 19:47 PM IST

మరిన్ని వార్తలు

కార్తీ నటించిన "చినబాబు" సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చెయ్యబోతున్నారు. జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన "చినబాబు" టీజర్ కు మంచి స్పందన లభించింది. జూన్ 23న జరగబోయే "చినబాబు" ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తీ, సూర్య పాల్గొనబోతున్నారు. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు.  

డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS