తేజ్- ఐ లవ్ యు విడుదల ఎప్పుడో తెలుసా

By iQlikMovies - June 14, 2018 - 19:44 PM IST

మరిన్ని వార్తలు

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. 

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జూన్‌ 16న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చెయ్యబోతున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది.

 

జూలై 6 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS