'దేవ్‌'లో రకుల్‌ - కార్తీ హాట్‌ కెమిస్ట్రీ.!

మరిన్ని వార్తలు

కార్తీ తాజా చిత్రం 'దేవ్‌'. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ వదిలారు. టీజర్‌ని బట్టి చూస్తే కార్తీకి బైక్‌ రేసింగ్‌ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. 'ఈ లోకంలో బతకడానికి ఎన్నో దారులున్నాయ్‌'. ఎవరో చెప్పారనీ, అర్ధంకాని చదువులు చదివి, ఇష్టం లేని ఉద్యోగం చేసి, ముక్కూ మొహం తెలీని నలుగురు మెచ్చుకుంటారని కష్టపడి పని చేసి, ఈగో, ప్రెషర్‌ కాంపిటేషన్స్‌లో ఇరుక్కుని అంటీ అంటనట్లు బతికేయడం ఒక దారి. ఇంకో దారి కూడా ఉంది.. అని కార్తి చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. 

బైక్‌ రేసర్‌గా కార్తి చాలా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా టీజర్‌లో చాలా ఎక్కువే చూపించేశారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఖాకీ' తర్వాత రకుల్‌, కార్తి జంటగా నటిస్తున్న చిత్రమిది. రకుల్‌ని చాలా హాట్‌గా చూపించారు. బాత్‌ టబ్‌లో స్నానం చేస్తున్నట్లు, కార్తీతో హాట్‌ హాట్‌ రొమాంటిక్‌ సీన్స్‌ చాలా టీజర్‌లో చూపించేశారు. 'ఖాకీ'లో కూడా రకుల్‌ - కార్తీ మధ్య హాట్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అలాగే ఈ సినిమాలో కూడా ఉండేటట్లుంది. 

ఇటీవల 'చినబాబు'తో హిట్‌ కొట్టిన కార్తీ ఈ సినిమాతో మరో కమర్షియల్‌ హిట్‌ అందుకుంటాడని టీజర్‌ కన్‌ఫామ్‌ చేసేస్తోంది. చినబాబులో రైతు పాత్రలో కాస్త లావుగా కనిపించిన కార్తీ ఈ సినిమాలో ఫిట్‌గా కనిపిస్తున్నాడు. రజత్‌ రవిశంక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'దేవ్‌'లో రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిస్‌ జైరాజ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. 

త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS