మళ్లీ మెగాస్టార్‌ టైటిలేనా కార్తీ.!

మరిన్ని వార్తలు

ఇటీవలే 'ఖైదీ' అనే టైటిల్‌తో తెలుగులో విడుదలైన కార్తి సినిమా ఆ టైటిల్‌కున్న పవరేంటో చూపించింది. గ్లామర్‌ లేకుండా, హీరోయిన్‌ లేకుండా, పాటలు, రొమాన్స్‌ లేకుండా ధియేటర్స్‌లోకొచ్చి, ధైర్యంగా హిట్‌ కొట్టింది. కార్తీ సాహసాన్ని అందరూ ప్రశంసించారు ఈ సినిమాతో. ఇప్పుడు ఇంకోసారి కార్తి తన సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాడు. తమిళంలో 'తంబి' అనే టైటిల్‌తో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని తెలుగులో 'తమ్ముడు' అని పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌తో విడుదల చేస్తారంటూ నిన్న మొన్నటిదాకా ప్రచారం జరిగింది.

 

లేటెస్ట్‌గా ఈ సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్‌లుక్‌నీ రిలీజ్‌ చేసి, షాకిచ్చింది చిత్ర యూనిట్‌. 'తమ్ముడు' కాదు, అన్నే అంటే, మళ్లీ మెగాస్టార్‌ సినిమా టైటిల్‌నే ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'దొంగ' సినిమా టైటిల్‌ని ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టి పోస్టర్‌ వదిలారు. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక, కార్తికి అక్క పాత్ర పోషిస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కార్తి, జ్యోతిక ముఖాల్ని సగం సగం డిజైన్‌ చేసి చూపించారు.

 

మధ్యలో ఫారెస్ట్‌ ఎట్మాస్పియర్‌, పోలీసులు, పోలీస్‌ జీపు ఉంది. అంటే కార్తి ఈ సినిమాలో దొంగగా కనిపించబోతున్నాడా.? ఏమో అంతే అనుకోవాలి. సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS