సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు..' ప్రమోషన్స్‌లో చాలా వీక్‌గా ఉంది.. అనే టాక్ వినిపిస్తోంది. ఆ టాక్‌కి కట్ ఆఫ్ ఇస్తూ, త్వరలోనే భారీ ఎత్తున ప్రమోషన్స్‌కి ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. ఎప్పుడెప్పుడు ఏ ఏ పోస్టర్లు విడుదల చేయాలి.? ఏ ఏ వీడియోలు విడుదల చేయాలి.? అనే దిశగా ఆల్రెడీ ఓ ప్రణాళిక సిద్ధం చేశారట.
ఈ నెల 23న దర్శకుడు అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక అక్కడి నుండి, రోజుల వ్యవధిలో సినిమాకి సంబంధించి ఒక్కో అప్‌డేట్ వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బన్నీ 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రమోషన్స్ ఊదరగొట్టేస్తున్నారు.
చిల్డ్రన్స్ డేతో సహా, ఏ సందర్భాన్నీ వదలకుండా డిఫరెంట్ డిఫరెంట్‌గా సినిమాని ప్రమోట్ చేస్తూ, ఫ్యాన్స్‌లో హుషారు నింపుతున్నారు. అది చూసి, మహేష్ ఫ్యాన్స్ 'సరిలేరు..' టీమ్‌పై ఒత్తిడి పెంచుతున్నా, ఎందుకో 'సరిలేరు..' టీమ్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. స్లో అండ్ స్టడీ స్ట్రాటజీని ఫాలో చేస్తోంది కాబోలు. కానీ, సినిమాపై రావల్సిన హైప్ రావాలంటే, తప్పదు పబ్లిసిటీ. లేకుంటే తప్పదు భారీ మూల్యం. అందుకే ఇక త్వరలోనే 'సరిలేరు..' ప్రమోషన్స్ షురూ చేయాలని డిసైడ్ అయ్యారట. చూడాలి మరి, మహేష్ తన ఫ్యాన్స్‌ని ఎలా జోరెత్తిస్తాడో.!
TEASER LOADING 💥💥#SarileruNeekevvaru
— Anil Ravipudi (@AnilRavipudi) November 16, 2019
Super Star @urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @AnilSunkara1 @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/6FaJTKzeJD