నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం.. కార్తికేయ 2. పలుమార్లు వాయిదా పడిన తరవాత ఈనెల 13న విడుదలైంది. తొలి రోజే మంచి టాక్ సంపాదించుకోవడంతో.. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లో దాదాపు రూ.14 కోట్లు సంపాదించుకొంది. నిఖిల్ కెరీర్‌లో ఇదే రికార్డ్. నార్త్ లో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రోజు ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండూ, మూడు రోజుల్లో వసూళ్లు విపరీతంగా పెరిగాయి. ఓవర్సీస్‌లో కూడా థియేటర్లు పెంచాల్సివచ్చింది. అక్కడ ఇప్పటి వరకూ దాదాపుగా రూ.1.8 కోట్లు సంపాదించింది.
3 రోజుల లెక్కలివీ..:
నైజాం: రూ.3.70 కోట్లు
సీడెడ్: రూ.1.55 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.1.43 కోట్లు
ఈస్ట్ : రూ. 0.92 కోట్లు
వెస్ట్: రూ. 0.68 కోట్లు
కృష్ఱ: రూ. 0.88 కోట్లు
కర్నాటక రూ. 0.30 కోట్లు
తమిళనాడు రూ. 0.40 కోట్లు
ఓవర్సీస్: 1.80 కోట్లు
నార్త్: 0.90 కోట్లు