మ‌ళ్లీ అవ‌కాశం రాద‌ని.... స్టేజీపైనే ఐల‌వ్ యూ చెప్పేశా_ కార్తికేయ

మరిన్ని వార్తలు

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు ధైర్యం ఎక్కువ. ఆయన పేరు చెబితే ముందు 'ఆర్ఎక్స్ 100' గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు. హీరోగా 'ఆర్ఎక్స్ 100' వంటి విజయం తర్వాత విల‌న్‌గా నటించడానికి ధైర్యం కావాలి. 'గ్యాంగ్ లీడర్'లో స్ట‌యిలిష్‌ విల‌న్‌గా నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. 'చావు కబురు చల్లగా' వంటి వైవిధ్యమైన సినిమా చేశారు. 'రాజా విక్ర‌మార్క‌'లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయతో ఇంటర్వ్యూ... * 'రాజా విక్రమార్క'గా కార్తికేయ ఎలా ఉంటారు? నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది.ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్ర‌స్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగం గానే ఉంటుంది. మా '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లకు తొలి సినిమా అయినా ఖర్చుకు వెనుకాడలేదు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా... థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే.

 

* కామెడీ... యాక్షన్... రెండిటిలో ఏది కష్టంగా అనిపించింది?

 

ఆల్రెడీ యాక్షన్ చేశాను కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్షన్ చేసినంత ఎక్కువగా కామెడీ చేయలేదు. ఈ మూవీలో ఉన్నట్టు చేయలేదు. కష్టం అని కాదు గానీ... నా మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని క్యూరియాసిటీ ఉంది. బేసిగ్గా... నేను బయట చాలా జోవియ‌ల్‌గా ఉంటాను. జోక్స్ వేయడం, ఫ్రెండ్స్ మీద పంచ్ డైలాగ్స్ వేయడం ఎక్కువ. అందువల్ల, కామెడీ చేయడం కష్టం ఏమీ అనిపించలేదు. బయట ఎలా ఉంటానో అలా నటిస్తే క్యారెక్టర్ చేయవచ్చని అనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా.

 

* 'ఆర్ఎక్స్ 100' టైమ్‌లో క‌థ విన్నాన‌ని చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్?

 

కథ డీల్ చేసిన విధానం. బేసిగ్గా... కామెడీ బేస్ చేసుకుని యాక్షన్ సినిమా ఇది. వీటన్నిటి కంటే దర్శకుడి మీద నమ్మకం వచ్చింది. శ్రీ సరిపల్లి కథను నేరేట్ చేశాక... పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను చేయగలడని నమ్మకం వచ్చింది. హానెస్ట్ పర్సన్ అనిపించాడు. స్క్రిప్ట్ నచ్చింది. అయితే... సినిమా చూస్తే గానీ చెప్పలేం. అటువంటి స్క్రిప్ట్. వినడానికి బావుంటుంది. కానీ, కరెక్ట్ విజువల్, మ్యూజిక్ పడినప్పుడు స్క్రీన్ మీద చూడటానికి బావుంటుంది. మేకింగ్ డిపెండ్ అయిన సినిమా. శ్రీని కలిసినప్పుడు అతను చేయగలడని అనిపించింది. ఒక్కో షెడ్యూల్ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింత బలపడింది.

 

* తొలిసారి ఎన్ఐఏ ఏజెంట్ రోల్ చేశారు. స్పెషల్ ప్రిపరేషన్ ఏమైనా...

 

ఎన్ఐఏ ఏజెంట్ అంటే... బోర్డ‌ర్‌లో జ‌రిగే క‌థ కాదు. దేశం లోపల జరిగే కథ. దర్శకుడితో కూర్చుని చేసిన డిస్కషన్స్ ఎక్కువ. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ...అన్నీ డిస్కస్ చేశా. గన్ ఎలా పట్టుకోవాలి? వంటి విషయాల్లో రీసెర్చ్ చేశా.

 

* 'రాజా విక్రమార్క'... చిరంజీవిగారి టైటిల్. మీరే సజెస్ట్ చేశానని చెప్పారు. రీజన్ ఏంటి?

 

శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. 'రాజా విక్రమార్క' టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ... చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు.

 

* చిరంజీవిగారికి టైటిల్ గురించి చెప్పారా?

 

టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు పంపించాను. 'గుడ్ లక్' అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS