అందరినీ కదిలిచింది 'జై భీమ్’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సూర్యకి హ్యాట్సప్ చెబుతున్నారు. అందులో నటించిన నటులకు ఫిదా అయిపోతున్నారు. రాజన్న, సిన తల్లి పాత్రలైతే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దర్శకుడు, నటుడు, నిర్మాత రాఘవ లారెన్స్ ని కూడా జై భీమ్ కదిలిచింది. ‘జై భీమ్’ సినిమాను చూసిన లారెన్స్.. నిజ జీవితంలో రాజన్న భార్య పార్వతి పరిస్థితిని తెలుసుకుని తీవ్ర వేదనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో జీవిస్తున్నట్లు తెలుసుకుని చలించిపోయారు.
పార్వతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పార్వతి అమ్మాళ్‌కి తన స్వంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. లారెన్స్ ప్రకటనతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన ఉదార హృదయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు లారెన్స్, ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రామాలు చేశారు. ఇదే క్రమంలో ఒక సినిమా చూసి బాదితురాలి గోడు తెలుసుకొని ఆమెకు సాయం చేయడం గొప్ప విషయమే.