భజే వాయు వేగం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: భజే వాయు వేగం
దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్   

రచన-కథ: ప్రశాంత్ రెడ్డి చంద్రపు
నిర్మాతలు: యూవీ కాన్సెప్ట్స్
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: ఆర్‌డీ రాజశేఖర్‌
కూర్పు: సత్య. జీ

బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్
విడుదల తేదీ: 31 మే 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5
   

RX 100 సినిమాతో టాలీవుడ్ లో కెరియర్ మొదలుపెట్టిన కార్తికేయ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. అయినా కానీ విభిన్న కథల్ని ఎంచుకుని సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాని `గ్యాంగ్ లీడర్" సినిమాలోనూ, కోలీవుడ్ లో అజిత్ నటించిన "వలిమై" సినిమాలోనూ విలన్ గా ఆకట్టుకున్నాడు. గత ఏడాది బెదురులంక సినిమాతో వచ్చి ఫ‌ర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు భజే వాయు వేగం అనే మూవీతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా అయినా కార్తికేయకు సక్సెస్ ఇచ్చింది లేదో చూద్దాం. 


కథ : 
తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించే కథ ఇది. ఓ వైపు ఫాదర్ సెంటిమెంట్, మరో వైపు క్రైమ్ అంశాలతో నేరేట్ చేసిన మిక్స్డ్ స్టోరీ భజేవాయు వేగం. క్రికెటర్ గా ఉన్న కార్తికేయ పోలీస్ స్టేషన్ లో ఎంట్రీ ఇవ్వటంతో  కథ మొదలవుతుంది. విలన్ గ్యాంగ్స్ కి చెందిన ఒక బ్యాగ్ మిస్ అవుతుంది. అది హీరోకి దొరుకుతుంది. ఆ బ్యాగ్ తీసుకుని హీరో  పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. మరో వైపు హీరో తండ్రి ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం హీరోకి కొంత డబ్బు అవసరం పడుతుంది. ఆ డబ్బులు సంపాదించడానికి హీరో ఎలాంటి రిస్క్ చేశాడు అన్నది కథ . ఆ బ్యాగ్ హీరో కి ఎలా దొరికింది. రౌడీలతో తనకు శత్రుత్వం ఎలా ఏర్పడింది, వీటన్నింటికి లింక్ ఏంటి ? హీరో తన తండ్రిని కాపాడుకోగలిగాడా ? విలన్స్ గ్యాంగ్ బాగ్ కోసం హీరోని ఏం చేసారు. తనకోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు. డబ్బులు సంపాదించే క్రమంలో ఆయన చేసిన క్రైమ్ ఏంటి అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. 


విశ్లేషణ : 
రొటీన్ కథ. పెద్దగా ఆకట్టుకోని సీన్స్, ఎమోషన్స్ సినిమాని పెద్దగా నడిపించలేకపోయాయి. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాని టేక్ ఆఫ్ చేసిన విధానం బాగుంది. రొటీన్ సీన్లని ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఏదో కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది కలిసి రాలేదు. రొటీన్ కథని దర్శకుడు తన స్క్రీన్ ప్లే తో మెప్పించగలిగాడు. స్క్రీన్ ప్లే మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా ఫాస్ట్ గా సాగుతూనే ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత కాసేపు స్లో అవుతుంది. మళ్ళీ వేగం పుంజుకొంటుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టులు, సెకండాఫ్ కథ ఆడియన్స్ ని కొంచెం థ్రిల్ చేస్తాయి. ఓవరాల్ గా స్టోరీ చూసుకుంటే రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లోట్విస్ట్ మినహా ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోవడం మైనస్. మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్ట్ లు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదనిపిస్తుంది. వాటి ప్లేస్ మెంట్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చి ఉంటే అవి సినిమాకి  బాగా హెల్ప్ అయ్యేవి. 


నటీనటులు :  
కార్తికేయకి ఇది కొత్త జోనర్. ఇంతవరకు ఇలాంటి జోనర్ లో కార్తికేయ సినిమా చేయలేదు. నటన పరంగా మంచి మార్కులే సంపాదించాడు. దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్ ని కార్తికేయ 100% స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. కథ లో కొత్తదనం లేకపోవటం వలన ఈ సినిమా  కార్తికేయకి మైనస్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కి తెలుగులో ఇది రెండో సినిమా. మొదట నిఖిల్ తో ‘స్పై’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇందులో యాక్షన్ సీన్స్, గ్లామర్ తో మెప్పించింది. ఇప్పడు భజే వాయు వేగం తో మరికొన్ని అవకాశాలు అందుకునేలా ఉంది. కార్తికేయ కి పర్ఫెక్ట్ జోడిలా అనిపించింది. తన పాత్రకి న్యాయం చేకూర్చింది. మిగతా వారు పర్వాలేదనిపించారు. 


టెక్నికల్: 
రథన్ మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదు. అర్జున్ రెడ్డి సినిమాకి రథన్ అందించిన మ్యూజిక్ కూడా ఒక ప్లస్ అయ్యింది అలాంటిది ఈసినిమాకి అతని సంగీతమే మైనస్ అయ్యింది. అసలు అంత అద్భుతమైన పాటలు అందించిన రథన్ నేనా ఈ సినిమాకి పాటలు అందించాడు అనే సందేహం కలగకమానదు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ విజువల్స్ బానే ఉన్నాయనిపించింది. యాక్షన్  సీన్స్ ను తెరకెక్కించడంలో తన విజువల్స్ తోపాటు కొన్ని డిఫరెంట్ షాట్స్ ని బాగా డిజైన్ చేశాడు. యూవీ క్రియేషన్స్ లాంటి బ్యానర్ కావటంతో  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హీరో మార్కెట్ కి మించి ఖర్చు పెట్టారని తెలుస్తోంది. 


ప్లస్ పాయింట్స్
కార్తికేయ న‌ట‌న‌
సినిమాటోగ్రఫీ


మైనస్ పాయింట్స్
రోటీన్ స్టోరీ
సంగీతం 


ఫైనల్ వర్దిక్ట్ : టైటిల్ లో ఉన్న వేగం సినిమాలో లేదు..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS