నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఎట్ నర్తనశాల'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు.
ఒకరు కశ్మీరా. కొత్త భామ. ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. అలాగే మరో ముద్దుగుమ్మ యామినీ భాస్కర్. గతంలో 'కీచక', కాటమరాయుడు' తదితర రెండు, మూడు చిత్రాల్లో నటించింది. అయితే అక్కడెక్కడా పెద్దగా రిజిస్టర్ కాని ఈ భామ ఈ సినిమాతో బాగా రిజిస్టర్ అయ్యింది. సినిమాలో ఓ సాంగ్‌లో విచ్చలవిడిగా అందాలరేసేసింది. బీచ్‌లో 'పిచ్చి పిచ్చిగా నచ్చావురా..' అంటూ సాగే ఈ సాంగ్‌లో యామిని అందాల ఆరబోతకు ఆకాశమే హద్దయ్యింది.
అలాగే మరో భామ కశ్మీరా కూడా ఏమంత తక్కువ చేయలేదు. పాటల్లో గ్లామర్‌గా కనిపించడానికి అస్సలేమాత్రం మొహమాట పడలేదు. పొట్టి కాస్ట్యూమ్స్‌లో హాట్ హాట్‌గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. అలాగే గ్లామర్‌తో పాటు, చాలా అందంగా కనిపించింది. పర్‌ఫామెన్స్ పరంగా కూడా సూపర్ అనిపించింది. యామినీతో పోల్చితే, ఈ కొత్త భామకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. క్యారెక్టర్ పరంగానూ కశ్మీరాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
ఇకపోతే ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో కనిపించి మెప్పించాడు. 'చలో' సూపర్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రిజల్ట్ ఆశించిన మేర వచ్చిందో లేదో నిదానంగా తెలియాల్సి వుంది.