'కాటమరాయుడు' పాడితే ఊగాల్సిందే!

మరిన్ని వార్తలు


పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' మూడో పాట విడుదలైంది. ఆడియో సింగిల్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేయడం న్యూ ట్రెండ్‌. ఆ ట్రెండ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తున్నాడు పవన్‌కళ్యాణ్‌. అదే పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకత. 'కాటమరాయుడు' టీజర్‌ కోటి వ్యూస్‌ దాటేయగా ఆడియో సింగిల్స్‌ కూడా అదరగొట్టేస్తున్నాయి. 'మిరా మీరా మీసం', 'లాగే లాగే' పాటలు ఇప్పటికే పాపులర్‌ అయిపోయాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే మార్మోగుతుండడం జరుగుతోంది. ఈ లిస్ట్‌లోకే కొత్త పాట 'జివ్వు జివ్వు' చేరిపోయింది. పవన్‌కళ్యాణ్‌ మత్తు మత్తుగా ఈ పాటలో కనిపించే అవకాశముంది. 'జివ్వు జివ్వు..' అని సాగే ఈ మత్తు పాటని అద్భుతంగా ఆలపించారు గాయనీ గాయకులు. సంగీతం బాగా కుదిరింది. సంగీత దర్శకుడు అనూప్‌ రుబెన్స్‌, పవన్‌కళ్యాణ్‌తో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంప్లీట్‌ ఎఫెర్ట్‌ పెట్టాడని పాటల్ని వింటే అర్థమవుతుంది. పవన్‌కళ్యాణ్‌ సరసన ఈ సినిమాలో శృతిహాసన్‌ జంటగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన 'గబ్బర్‌సింగ్‌' చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. అలాగే డాలీ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ నటించిన 'గోపాల గోపాల' కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో పవన్‌ దేవుడిగా నటించాడు. 'కాటమరాయుడు'లో 'జివ్వు జివ్వు' పాట విషయానికొస్తే, అభిమానులు ఆ పాటలోని మైకాన్ని మేగ్జిమమ్‌ ఫీలవుతున్నారంటే అది పవన్‌ ఇచ్చిన మైకం అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS