మళ్ళీ వాయిదా పడిన కాటమరాయుడు!!

By iQlikMovies - January 23, 2017 - 12:17 PM IST

మరిన్ని వార్తలు

జనవరి 26న కాటమరాయుడు టీజర్‌ వస్తుందనే టాక్‌ వినిపించింది. అయితే మళ్ళీ పోస్ట్‌పోన్‌ అయ్యిందట. జనవరి 1న అనుకున్నారు, సంక్రాంతికి పోస్ట్‌పోన్‌ అయ్యింది. జనవరి 26న ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే జనవరి 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం యువతతో కలిసి పోరుబాట పట్టనున్నారు పవన్‌. అందుకే టీజర్‌ విడుదల వాయిదా చేసినట్లుగా వార్తలు వినవస్తున్నాయ్‌. కిషోర్‌ కుమార్‌ పార్దసాని (డాలీ) దర్శత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. పవన్‌కి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు అయిన శరద్‌మరార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ముద్దుగుమ్మ శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తమిళ్‌లో ఘన విజయం సాధించిన 'వీరమ్‌'కి తెలుగు రీమేకే 'కాటమరాయుడు' సినిమా. ఈ సినిమాలో పవన్‌ పంచె కట్టులో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అలాగే రియల్‌ లైఫ్‌లో ఇద్దరు అన్నయ్యలకు ముద్దుల తమ్ముడైన పవన్‌ ఈ సినిమా కోసం ముగ్గురు తమ్ముళ్లకి అన్నయ్యగా ఈ సినిమాలో కనిపిస్తుండడం విశేషం. 'వీరమ్‌'లోని మెయిన్‌ ఎలిమెంట్‌ని తీసుకుని, పవన్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలో చాలా మార్పులు చేసిన సంగతి తెలిసిందే. హుందా అయిన పాత్రలో కనిపిస్తూనే పవన్‌ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్త తీసుకుంది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS