'కాటమరాయుడు' అరకోటిని ఉఫ్‌మనిపించేస్తాడు

మరిన్ని వార్తలు

యూ ట్యూబ్‌లో 'కాటమరాయుడు' టీజర్‌ బుల్లెట్‌ స్పీడుతో దూసుకెళ్లిపోతోంది. అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్‌ సాధించిన తెలుగు సినిమా టీజర్‌గా 'కాటమరాయుడు' నిలిచింది. తొలి 24 గంటల్లోనే ఈ సినిమా 40 లక్షల వ్యూస్‌ దాటేసింది. ఇక మరి కొన్ని గంటల్లోనే ఈ టీజర్‌ అరకోటిని దాటేస్తుంది. తొలి ఒకటి రెండూ రోజుల్లోనే కోటి వ్యూస్‌ని దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫాస్టెస్ట్‌ ఒన్‌ క్రోర్‌ వ్యూస్‌ సాధించిన తెలుగు సినిమా పవన్‌ సినిమానే అవుతుంది. తమిళ్‌ సినిమా 'వీరమ్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. డాలీ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో పవన్‌ లుక్‌ ఓ స్పెషల్‌ కాగా, ముగ్గురు తమ్ముళ్లకి అన్నయ్యగా పవన్‌ నటించడం మరో స్పెషాలిటీ. అలాగే టీజర్‌లో పవన్‌ చెబుతున్న డైలాగులు అభిమానుల్ని మరింత ఉద్వేగపరుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందా అనే ఆశక్తి మరింత పెరిగిపోయింది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ శృతిహాసన్‌ పవన్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోంది. మాతృకలో హీరోగా నటించిన అజిత్‌, మెరిసిన గెడ్డం, తెల్లబడిన జుట్టుతో తమన్నాతో రొమాన్స్‌ చేయగా, ఇక్కడ తెలుగులో రొమాంటిక్‌ కింగ్‌ పవన్‌ కళ్యాణ్‌ రొమాంటిక్‌ లుక్స్‌ మరింత అదిరిపోయేలా ఉంటాయన్న సంగతి వేరే చెప్పక్కర్లేదు. పంచెకట్టుతో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌. రాజసంతో పాటు మరింత హుషారుగా కూడా కనిపిస్తున్నాడు. టీజర్‌లో అలా అలా వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కి కిర్రాక్‌ పుట్టిస్తున్నాయి. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS