నారా రోహిత్ కొత్త సినిమా 'కథలో రాజకుమారి'. టైటిల్ వినడానికే చాలా కొత్తగా ఉంది. అయినా నారా రోహిత్ సినిమాలే అంత. సినిమాల్లో కంటెంట్ కొత్తగా ఉంటుంది, టైటిల్స్ ఇంకా కొత్తగా ఉంటాయి. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రేమించిన ప్రియురాలిపైనే పగతీర్చుకుంటాడట హీరో. టీజర్‌లో ఈ విషయం స్పష్టమయ్యింది. 'నాకెన్నో రూపాలు, నాకెన్నో కోపాలు.. కానీ ఒకటే ప్రేమ. కానీ అంత ఈజీ కాదు ప్రేమించిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం' అని నారా రోహిత్ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. టీజర్‌ని అద్భుతంగా కట్ చేశారు. టైటిల్‌తోనే ఓ రకం ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందంటే, టీజర్ వచ్చాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నమిత ప్రమోద్ ఈ సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్ సూరపనేని ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా సక్సెస్‌తో మంచి మార్కులేయించుకున్నాడు నారా రోహిత్. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోగలడు నారా రోహిత్. ఆయన తొలి సినిమా 'బాణం' దగ్గర నుండీ కథల ఎంపికలో ఏదో వైవిధ్యం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే అన్ని సార్లూ కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయినా కానీ, సినిమా పరంగా నారా రోహిత్ సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకెళ్లే ఈ తరం హీరోల్లో నారా రోహిత్ ముందు స్థానంలో ఉంటాడు.