కత్తి మహేష్ పేరు ప్రస్థావించకుండా నాగబాబు 'నీచుడు' అంటూ చేసిన విమర్శలకు కౌంటర్ వచ్చింది. మీరు రాముడు భక్తులా.? మీ సంగతేంటో నాకు తెలుసు. రాజకీయాల్లోకి వచ్చి సీట్లు అమ్ముకున్నారు. 'జబర్దస్త్' షోలో పిచ్చి నవ్వులు నవ్వుతారు. ఈ బాగోతాలు బయట పెట్టే రోజు త్వరలో వస్తుంది.. అంటూ కత్తి మహేష్ నాగబాబుపై ఘాటైన విమర్శలు చేశాడు.
దళితుడ్ని అయిన నన్ను నీచుడు అనడం ఏంటని ప్రశ్నించాడు. ఇదేనా దళితుడి పట్ల మీకున్న గౌరవం అని నిలదీశాడు. శ్రీరామున్ని దగుల్బాజీ అంటూ వ్యాఖ్యానించి అనంతరం నాగబాబు మహేష్ కత్తి పైన విమర్శలు చేసిన సంగతి విదితమే.
అతనికి వివాదాలు కొత్త కాదు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాడాయన. తనకు మాత్రమే వాక్ స్వాతంత్య్రం ఉండాలిన కోరుకుంటాడు. ఇంకెవరికీ అది ఉండకూడదన్నది ఆయన గారి బాధ. రామున్ని దగుల్బాజీగా కత్తి మహేష్ తిట్టొచ్చు. అది ఆయన వాక్ స్వాతంత్య్రం. అది కరెక్ట్ అయితే కత్తి మహేష్‌ని నీచుడు అనడం నాగబాబు వాక్ స్వాతంత్య్రం.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
మెగా కాంపౌండ్‌తో కత్తి మహేష్ గొడవ ఈనాటిది కాదు. ఎప్పటి నుండో జరుగుతున్నదే.