కత్తిమహేష్ గండం నుంచి గట్టెక్కేశాడు. ఇటీవల కత్తి మహేష్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మహేష్ కి కీలకమైన ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో కత్తిమహేష్ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నాడు. ప్రమాదంలో కత్తి మహేష్ కంటికి తీవ్రగాయమైంది. ఆయనకంటి చూపు కోల్పోయే ప్రమాదం వచ్చింది. మహేష్ కంటి చూపు పూర్తిగా కోల్పోయాడని కూడా వార్తలొచ్చాయి.
అయితే.. మహేష్ కంటికి ఏ ప్రమాదమూ లేదని డాక్టర్లు ధృవీకరించారు. ఈరోజు ఉదయం ఐసీయూ నుంచి మహేష్ ని షిఫ్ట్ చేశారు. మరో వారం రోజులు ఆయన ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. త్వరలోనే మహేష్ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తాడని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కి మరో కీలకమైన ఆపరేషన్ చేయాల్సివుందని సమాచారం అందుతోంది. అది దేనికి సంబంధించింది? ఎప్పుడు చేస్తారు? అనే విషయాలు తెలియాల్సివుంది.