బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ వివాహం ఘనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాగార్జునే కాదు, ఇంకా చాలా మంది పెద్దలున్నారు. అన్నట్లు కత్రినా తల్లితండ్రులుగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ దంపతులు వ్యవహరించారు. ఏంటీ పెళ్లి తంతు.? ఎక్కడ.? ఎలా.? ఎప్పుడు.? అనుకుంటున్నారా.? కళ్యాణ్ జ్యూయలర్స్‌లో. అదేంటీ అని మళ్లీ ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ మీరు విన్నది నిజమే. పెళ్లి కూతురుగా కత్రినా కైఫ్ కనిపించడం నిజమే. కానీ, ఇది ఓ యాడ్ షూట్ కోసం. కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్స్ అన్నీ చాలా రిచ్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి ఇంకా రిచ్‌గా చిత్రీకరించారు. అన్ని భాషల్లోనూ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న వాళ్లందరితోనూ ఈ యాడ్ షూట్ చేశారు.
యాడ్ నిజంగా అద్భుతంగా వచ్చింది. హిందీలో కత్రినా కైఫ్, తెలుగులో నాగార్జున, కన్నడలో రాజ్‌కుమార్, తమిళంలో ప్రభు తదితరులు కళ్యాణ్ జ్యూయలర్స్‌ని ప్రమోట్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ బిగ్‌బీ అమితాబ్ సతీ సమేతంగా దర్శనమిస్తుంటారు. అందుకే వీరందరితోనూ ఈ సారి ఇలా సరికొత్త యాడ్‌ని చిత్రీకరించి వార్తల్లో నిలిచింది కళ్యాణ్ జ్యూయలర్స్ సంస్థ. యాడ్ భలేగుందిలెండి. వివిధ భాషల నుండి స్టార్ నటీనటుల్ని ఇలా ఒకేసారి తెరపై నిండుగా చూస్తుంటే, కన్నుల పండుగలా వుంది.