'లైగర్' ఎఫెక్ట్ 'ఖుషి' పై ఏమాత్రం పడలేదని తేలిపోయింది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా... ఖుషి.
ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా బయటకి రాలేదు. అప్పుడే ఆడియో రైట్స్ 13 కోట్లకు అమ్మేశారు. ఇప్పుడు ఓ టీ టీ, శాటిలైట్ వంతు వచ్చింది. ఖుషి నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు అమ్ముడు పోయినట్టు టాక్. శివ నిర్వాణ దరకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. సమంత అనారోగ్యం పాలు కావడంతో ఆలస్యం ఆలస్యం అవుతోంది. మరో 35 రోజుల షూటింగ్ ఇంకా బాకీ వుంది. అందులో సమంత భాగమే ఎక్కువ. తను ఎప్పుడు కోలుకుంటే అప్పుడు షూట్ మొదలు అవుతోంది. సమంత నటించిన యశోద శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. అందులో సామ్ కొంచెం నీరసం గానే కనిపిస్తోంది. సామ్ షూటింగ్ కి రెడీ అవ్వడానికి ఇంకొంచెం సమయం పట్టేట్టే కనిపిస్తోంది.