పుష్ప సూపర్.. డూపర్ హిట్ అయిన దగ్గర్నుంచి అందరి ద్రుష్టి... పార్ట్ 2 పైనే. పుష్ప 2 ఎప్పుడు వస్తుందా...? అనే ఎదురు చూపుల్లో పడిపోయారు. అయితే అనేక కారణాల వల్ల పుష్ప షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈనెల 13 న పుష్ప షూటింగ్ బ్యాంకాక్ లో ప్రారంభం కాబోతోంది. అక్కడి అడవుల్లో దాదాపు 30 శాతం షూటింగ్ చేస్తారని సమాచారం. అల్లు అర్జున్ పులి తో తలపడే ఒక భారీ యాక్షన్ సీన్... ఈ సినిమా లో ఉందని సమాచారం. ఆ ఫైట్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ కానుందట. ఆ ఫైట్ బ్యాంకాక్ అడవుల్లో తెరకెక్కిస్తారు. ఇందుకోసం విదేశీ ఫైట్ మాస్టర్లు పని చెయ్యబోతున్నారని టాక్. అల్లు అర్జున్ తో పాటుగా ఫాహేద్ ఫాజల్, రష్మిక, సునీల్... వీళ్లంతా బ్యాంకాక్ పయనం అవ్వబోతున్నారు. 2023 చివర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.