కౌశల్ ఆర్మీ @ బిగ్ బాస్ షో

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇంకొక రెండు వారాల్లో ముగియనుంది. దాదాపు మూడున్నర నెలల పాటు సుదీర్గంగా సాగే ఈ షోకి సంబంధించి అనేక సంచలనాలని మనం ఈ సీజన్ మొత్తం చూస్తూనే ఉన్నాము.

అందులో ముఖ్యంగా కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన సంగతి విదితమే. ఈ కౌశల్ ఆర్మీ తమ అభిమాన కాంటెస్టంట్ అయిన కౌశల్ ని కాపాడుకుంటూనే బిగ్ బాస్ ఇంటిలో కౌశల్ కి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వారిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం వంటి చేస్తుంటుంది. ఇక గతవారం కౌశల్ ఆర్మీ పేరిట హైదరాబాద్ లో 2K వాక్ జరపడం వారి అభిమానానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.

ఈ తరుణంలోనే ఇంటి సభ్యుల మధ్యలో కూడా దీనికి సంబంధించిన చర్చ రావడంతో నిన్నటి ఎపిసోడ్ లో నాని కూడా ఇంటి సభ్యులని ఈ అంశం గురించి మాట్లాడడం ఇలా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారంతో ఎలిమినేషన్ ప్రక్రియ పైన ఏమైనా ప్రభావం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? అని వాళ్ళని ప్రశ్నించాడు.

అదే సమయంలో కౌశల్ ఆర్మీ గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా అని కౌశల్ నే అడిగాడు నాని. దానికి బయటనుండి వచ్చిన వారు చెప్పడం తప్ప తనకెలాంటి సమాచారం లేదు అని చెప్పాడు. అసలు బయట జరుగుతున్న ఈ తతంగం మొత్తం లోపల ఉన్న సభ్యులకి తెలియడం వెనుక వైల్డ్ కార్డు ఎంట్రీలే కారణం అని చెప్పక తప్పదు. ఈ సీజన్ నిర్వహణలో జరిగిన తప్పిదం ఏదైనా ఉందంటే అది నూతన్ నాయుడు & శ్యామల ని మళ్ళీ ఇంటిలోనికి పంపడమే.

ఏదేమైనా... ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంటి వెలుపల జరిగిన సంచలనాల్లో కౌశల్ ఆర్మీ ఒకటి అనేది నిర్వివాదాంశం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS