అమెరికాలో నిర్వహించిన ఈవెంట్స్ కి సంబంధించి ‘మా’ అసోసియేషన్ కి రావాల్సిన డబ్బులలో అవకతవకలు జరిగాయి లేదు జరగలేదు అంటూ ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేష్ లు ఇటీవల ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
ఈ నేపధ్యంలో ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించేందుకు ఏర్పడిన తెలుగు ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. వారు మాట్లాడుతూ- ఈ సమస్య పై ఇరువర్గాలతో చర్చించాము, ఆ తరువాత సదరు డాక్యుమేంట్స్ ని పరిశీలించాక ఎటువంటి అవకతవకులు జరగలేదు అని నిర్ధారించుకున్నాము.
అందుకనే ఈ ప్రెస్ మీట్ పెట్టి అందులో ఎలాంటి తప్పు జరగలేదు అని చెబుతున్నాము. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన మాటల యుద్ధం జరిగి ఉండాల్సింది కాదని, భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఈ కమిటీ పరిష్కరిస్తుంది అని కమిటి సభ్యులైన భరద్వాజ్, సురేష్ బాబు, కేఎల్ నారాయణ & జెమిని కిరణ్ లు తెలియచేశారు.
ఇక ఈ వివాదంతో మహేష్, ప్రభాస్ లతో నిర్ణయించుకున్న ఈవెంట్స్ జరుగుతాయా లేదా అన్న మీమాంశకి తెరపడింది అనే చెప్పాలి.