బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ మాములుగానే మొదలైనా రాను రాను ఆసక్తికరంగా మారుతున్నది. టైటిల్ గెలిచే అవకాశం ఉంది అన్న వారు వరుసగా ఇంటి నుండి వెళ్ళిపోతుండడం ఈ షోని ఫాలో అవుతున్న వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి బాగా దగ్గరిగా ఉన్న కౌశల్-బాబు గోగినేనిలు ఈ సోమవారం జరిగిన నామినేషన్ల సమయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. కౌశల్ తో పెట్టుకున్న వారు ఇంటి నుండి వెళ్ళిపోతారు అన్న నమ్మకం నిజం కాదు తప్పు అని నిరూపించడానికి బాబు గోగినేని తన నామినేషన్ గా కౌశల్ పేరుని ప్రతిపాదించాడు.
ఇక వెంటనే తన వంతు రాగానే కౌశల్ తాను నామినేట్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని పేరుని చెప్పడం అందుకు కారణంగా గతంలో దర్శకుడు రాజమౌళి పైన బాబు చేసిన వ్యాఖ్యలు నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పడం అందరిని విస్మయానికి గురిచేసింది. అయితే రాజమౌళి పైన వ్యాఖ్యలు ఈ ఇంటిలో చేయలేదు తానేప్పుడో బయట చేశాను అని బాబు వివరణ ఇచ్చాడు.
ఈ అంశం వీరిరువురి మధ్య తీవ్ర మనస్పర్ధలకి దారి తీసింది. ప్రస్తుతానికైతే వీరి మధ్యలో మాటలు అయితే లేవు. పైగా కౌశల్ ని ఎలాగైనా ఇంటి నుండి పంపించాలి అని అందుకోసమో తాను బయటకి వెళ్ళిపోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని బాబు చెబుతుండడం కొసమెరుపు.