బిగ్ బాస్ ఇంటి సభ్యులకి నిన్న, మొన్న జరిగిన “హలో” టాస్క్ జరగగా వారి వారి కుటుంబసభ్యుల నుండి ఫోన్స్ రావడం వారందరూ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ తరుణంలో ఇద్దరు ఇంటి సభ్యులకి మాత్రం తమ అమ్మల నుండి విలువైన సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ సలహాలకి సంబందించిన చర్చ ఆడియన్స్ లో నడుస్తున్నది. ముందుగా సామ్రాట్ కి తన తల్లి నుండి వచ్చిన సలహా ఏంటంటే- నువ్వు బిగ్ బాస్ హౌస్ కి దేనికోసం వెళ్ళావో దాని పైనే దృష్టి పెట్టు అంతేతప్ప వేరే వాటిపైన దృష్టి పెట్టకు, అర్దరాత్రిళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఈతలాంటివి చేసి ఆరోగ్యం పాడుచేసుకోకు అని చెప్పింది. ఆమె పరోక్షంగా తేజస్వి గురించి చెప్పిందంటూ ఆ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక తనీష్ కి కూడా ఆయన తల్లి కూడా సుమారుగా ఇటువంటి సలహానే ఇచ్చారు. ఇంటిలో దీప్తి సునైనా తో ఇప్పుడు ఉన్నంత చనువుగా, ఆమెని గారాభం చేయడం వంటివి చేయకు, నువ్వు అలాంటివి చేయడం బయట షో చూస్తున్న వారికి అస్సలు నచ్చడం లేదు, అలాంటివి చేయకు నాన్నా తనీష్ అంటూ ఆమె ఫోన్ లో చెప్పడం జరిగింది.
మరి ఈ రెండు సలహాలని సామ్రాట్-తనీష్ లు పాటిస్తారా లేదా అన్నది వచ్చే ఎపిసోడ్స్ లో చూడాలి. మరి ఈ ఇద్దరికి వచ్చిన సలహాలు సమంజసమా? కాదా? అనే దాని పైన మీ అభిప్రాయాన్ని ఈ క్రింద కామెంట్ చేయండి.