బిగ్‌హౌస్‌లో కౌషల్‌ని మిగిలిన హౌస్మేట్స్ రౌండప్ చేయడం కొనసాగుతూనే ఉంది. నూతన్‌నాయుడు మినహాయిస్తే మిగతా హౌస్ మేట్స్ అంతా ఒకవైపు నిలబడ్డారు. కౌషల్ ఒక్కడే ఇంకోవైపు నిలబడ్డాడు. నేను ఎలిమినేట్ అయిపోయినా ఫర్వాలేదు. కౌషల్ మీద కుట్ర కొనసాగాలి, నామినేట్ చేస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు.. అని ఎప్పుడో బాబు గోగినేని పీకిన క్లాస్ హౌస్మేట్స్ అందరిలో బలంగా నాటుకుపోయింది.
ఇప్పుడు ఉన్న హౌస్‌మేట్స్‌లో ప్రతీ ఒక్కరూ అదే ఫాలో అవుతున్నారు కౌషల్ విషయంలో. ఇంకో 12 రోజుల్లో షో ముగిసిపోతుంది. తర్వాత అందరూ మామూలు మనుషులే. అది తెలుసుకోవటం లేదు. ఒకేసారి కౌషల్‌ని దాడి చేసి అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనే ఆలోచనతోనే ఉన్నారు. నిజానికి ఇవేమీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లా అనిపించడం లేదు. వాళ్ల గేమ్ వాళ్లు ఆడడం మానేసి, కౌషల్‌ని టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారు.
ఇది పరోక్షంగా కౌషల్‌కి మేలే చేస్తోంది. హౌస్‌లో అతను అనుభవిస్తున్న నరకం బయట ఆయనపై సింపతీ పెరిగేలా చేస్తోంది. అంటే కౌషల్‌ని ఓడించేద్దామనుకుంటున్న హౌస్మేట్స్ తమకు తెలియకుండానే అతని గెలుపుకు సహకరిస్తున్నట్లు భావించాలేమో.