బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా “గుడ్డు” టాస్క్ ఇవ్వడం జరిగింది. హౌస్ లోని ప్రతి సభ్యుడు తాము ఈ వారం నామినేషన్ చేసే ఇద్దరు సభ్యుల పైన గుడ్డు పగలగోట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ గుడ్డు పగలగోట్టడమే ఇంటిలో పెద్ద చర్చకి దారి తీసింది.
ముఖ్యంగా ఈ నామినేషన్లలో కౌశల్, నందిని & బాబు గోగినేని ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం నామినేషన్లలో కౌశల్ కి ఎక్కువ ఓట్లు రాగా దానికి ముఖ్య కారణంగా కౌశల్ తో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే అన్న మాట.
అయితే అది ఒక మూడ నమ్మకం లాంటిది అని దానిని తాను తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు అందుకోసమే కౌశల్ ని నామినేట్ చేసినట్టుగా బాబు గోగినేని చెప్పగా తనని సలహాల పేరిట ప్రతి నిత్యం ప్రభావితం చేస్తున్న కారణంగా అదే సమయంలో తాను చేసిన సహాయం గురించి పదే పదే చెప్పడం కూడా తనకి బాధ కలిగిస్తున్న కారణంగా కౌశల్ పైన గుడ్డు కొట్టి నామినేట్ చేశారు.
ఈ తరుణంలో కౌశల్ వారిరువురిని నామినేట్ చేస్తూ- మీరు దేవుడిని నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం కాని తమకి (నటులకి) దేవుడు అంటే రాజమౌళి అని అట్లాంటిది అయన పైన మీరు చేసిన కామెంట్స్ కి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు.
ఇక నందిని విషయానికి వస్తే, తనని ఒక స్నేహితురాలు అని నమ్మి తప్పు చేశాను అని ఆపదలో ఆడుకుంటే తనని ఇలా నామినేట్ చేయడం తప్పు అని చెప్పి నందినిని తలపైన గుడ్డు కొట్టాడు.
కొసమెరుపు ఏంటంటే- ఈ వారం అసలు ఎలిమినేషన్ లేదు అని బిగ్ బాస్ ప్రకటించడం అయితే ఆ విషయం ఇంటి సభ్యులకి తెలియదు.