ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేషన్‌లో భాగంగా తేజస్వి మదివాడను బయటికి పంపించారు. అయితే మొదట్నుంచీ బిగ్‌బాస్ షోలో జరుగుతున్న అన్ని గొడవలకు కారణం తేజునే అనే నెగిటివ్ టాక్ రన్నింగ్‌లో ఉంది. ఆ కారణంగానే తేజుని బయటికి పంపించారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తేజు ఎలిమినేషన్ తాత్కాలికం మాత్రమేనట అనే టాక్ కూడా వినిపిస్తోంది.
త్వరలోనే తేజు మళ్లీ బిగ్‌హౌస్‌లోకి వెళ్లబోతోందట. శ్యామల ఎలిమినేషన్ కూడా ఇలాగే తాత్కాలికమంటూ, పర్సనల్ రీజన్ కారణంగానే ఆమెను కూడా బయటికి పంపించారనీ, మళ్లీ ఆమెకు లోపలికి వెళ్లే ఛాన్స్ ఉందనీ తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తేజును 'బిగ్‌బాస్'ని మిస్ అవుతున్నావా అని అడిగితే, అవును చాలా మిస్ అవుతున్నానంటోంది. మళ్లీ అవకాశమొస్తుందేమో అని కూడా చెబుతోంది.
ఇప్పటివరకూ బయటికి వచ్చిన వారు ఎవరూ ఆ మాట చెప్పలేదు. అంటే తేజు రీ ఎంట్రీ ఉండబోతోందనే అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకూ నిజమో తెలీదు ఈ వీకెండ్‌లో ఓ స్పష్టత రావచ్చు.
టోటల్‌గా బిగ్‌బాస్ నుండి బయటికి వచ్చే ప్రతీ వారు ఏదో ఒక గొడవ కారణంగా ఎలిమినేట్ అవుతున్న వారే కావడం గమనించదగ్గ అంశం. క్యాజువల్‌గానే హౌస్‌లో ఆ గొడవలు క్రియేట్ అవుతున్నాయా? లేదా అనేది మాత్రం బిగ్‌బాస్ వీక్షకుల ఊహకు అందడం లేదు.