ఓ కథ చెప్పాడు. మా నక్షత్రం అన్నాడు. వేటగాడు అన్నాడు. కూతురు లల్లీ పేరు చెప్పాడు. రాజ్యం, పులి, రాజు, పట్టాభిషేకం, బాణాలు, రక్తపాతం.. అంటూ ఎమోషనల్ బరస్ట్ అయ్యాడు. దానికి కారణం ఈ వారం ఎలిమినేట్ అయిపోతాననే గట్టి నమ్మకంతోనే కౌషల్ ఇలా బరస్ట్ అయ్యాడు కాబోలు.
హౌస్‌లో తాను అనుభవించిన ఈ మానసిక క్షోభని బయటికి వచ్చి చెప్పుకోలేనేమో. చెప్పినా అది అందరికీ చేరదేమో అనే కౌషల్ ఈ వీకెండ్‌లో హోస్ట్ నాని సాక్షిగా ఇలా బయటపడ్డాడు. రెండు మూడు రోజుల నుండి చెబుతూనే ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది నేనేనని. ఎందుకంటే హౌస్‌లో అతనికి సపోర్ట్ చేసే మరో కంటెస్టెంట్ లేడు. దాంతో ఎంత కష్టపడినా, ఫలితం దక్కేది లేదని కౌషల్‌కి అర్ధమైపోయింది. హౌస్ నుండి తాను బయటికి రావడం తప్పదనుకున్నాడు. అందుకే ఈ స్టోరీ ప్రిపేర్ చేసుకున్నాడు.
నో ఇది ప్రిపరేషన్ కాదు. ఆయన ఆవేదన. ఈ 106 రోజుల ప్రయాణంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఆయన పడిన క్షోభని, మనోవేదనని కథ రూపంలో చెప్పి, కౌషల్ అందరి మనసును మాటల్లో చెప్పేందుకు వీలు లేనంతగా టచ్ చేసేశాడు. అసలు సిసలు పోరాట యోధుడు కౌషల్. మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆఫ్ ది బిగ్‌హౌస్.
అయితే ఆయన కష్టం ఫలించి కథలో చెప్పినట్లుగా పులిని పట్టుకుంటాడా? అదే బిగ్‌బాస్ కిరీటాన్ని దక్కించుకుంటాడా? ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. ఈ శనివారం జరగబోయే ఫినాలేలో తెలిసిపోతుంది. డోన్ట్ మిస్ దిస్ వీక్ బిగ్‌బాస్.!