సామ్రాట్‌ 'టాప్‌ 3' లో ఉండడా?

By iQlikMovies - September 24, 2018 - 11:52 AM IST

మరిన్ని వార్తలు

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ చివరి దశకు చేరుకుంది. రోల్‌ రైడాని ఎలిమినేట్‌ చేయడం ద్వారా ప్రజెంట్‌ ఐదుగురు సభ్యులు హౌస్‌లో ఉన్నారు. సామ్రాట్‌, గీత, దీప్తి, తనీష్‌, కౌషల్‌. ఈ ఐదుగురిలో బిగ్‌బాస్‌ టైటిల్‌ దక్కించుకునేదెవరు.? అది నిజంగా ప్రజల చేతుల్లోనే ఉందా.? కంటెస్టెంట్స్‌ని గెలిపించేందుకు ప్రేక్షకులు వేసే ఓటింగ్‌లో చాలా అనుమానాలున్నాయి. 

గతంలో జరిగిన నూతన్‌, గణేష్‌ ఎలిమినేషన్‌ అందరికీ షాకింగ్‌ అనిపించింది. తాజాగా రోల్‌ రైడా ఎలిమినేషన్‌ కూడా పెద్ద షాకే ఇచ్చింది ఆడియన్స్‌కి. సో ఏదైనా జరగొచ్చు బిగ్‌బాస్‌లో. అయితే టాప్‌ 3 లో కౌషల్‌, గీత, తనీష్‌ ఉంటారనీ తాజాగా ప్రచారం జరుగుతోంది. మొట్టమొదటగా బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ అయిన సామ్రాట్‌ టాప్‌ 3లో ఉండడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌ గ్రాఫ్‌ లెక్కకొస్తే, సామ్రాట్‌, దీప్తి కొంచెం వీక్‌గా ఉన్నారు. కౌషల్‌ది మొదటి స్థానమే. రెండో స్థానంలో తనీష్‌, గీత పోటీ పడుతున్నారట. 

టోటల్‌గా ఫైనల్‌ వార్‌ గీత, కౌషల్‌కి మధ్య ఉండబోతోందని తెలుస్తోంది. ఏమో చెప్పలేం, బిగ్‌బాస్‌ ఈక్వేషన్స్‌ ఎలాగైనా మారిపోవచ్చు. తనీష్‌ ముందుకొచ్చేసినా వచ్చేయొచ్చు. ఏది ఏమైనా బిగ్‌బాస్‌ టెన్షన్‌కి లాస్ట్‌ వీక్‌ ఇది. 

ఈ వీకెండ్‌లో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుంటారనే ఉత్కంఠకి తెర పడిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS