స్వర మాంత్రికుడు అయిన కీరవాణి తాజాగా ఒక చిత్రానికి ఆయన వృత్తిపరంగా అన్యాయం చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నది.
ఆ వివరాల్లోకి వెళితే, కీరవాణి తాజాగా సంగీతం అందించిన చిత్రం జువ్వ. ఈ చిత్రం నిన్న విడుదలవ్వడం ప్రేక్షకులు దానిని తిరస్కరించడం కూడా జరిగిపోయింది. అయితే ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో కూడా కీరవాణి ఫోటోని వేయడం వంటివి ప్రముఖంగా చేశారు.
దీనితో కీరవాణి ఈ చిత్రానికి ఇచ్చే సంగీతం పైన అందరికి ఆసక్తి పెరిగింది. కాని ఈ సినిమాలో పాటలు ఏ మాత్రం బాగోలేవు అని శ్రోతలు పెదవి విరిచారు. అంతేకాకుండా ఈ సినిమా BGM విషయంలో కూడా ఆయన మార్కు పనితనం ఏమాత్రం కనపడలేదు అని ఈ చిత్రం చూసిన వారు అంటున్నారు.
అయితే ఈయన ఈ సినిమా టైటిల్ విషయంలో ఇచ్చిన సలహా మాత్రమే క్లిక్ అయింది తప్ప ఆయన సంగీతం మాత్రం ఏరకంగానూ పనిచేయలదని ఒకరకంగా కీరవాణి అన్యాయం చేశారు అని అనేస్తున్నారు పలువురు.