'మహానటి' తో నేషనల్ అవార్డు అందుకుని దేశవ్యాప్తంగా తన కీర్తిని చాటుకుంది 'కీర్తి సురేష్'. తన నటన, అభినయంతో తెలుగులోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియా లో సెపరేట్ క్రేజ్ సంపాదించుకుంది కీర్తి. తాజాగా 'పెంగ్విన్' అనే థ్రిల్లర్ చిత్రం తో ఓటీటీ లో కన్పించింది కీర్తి. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా.. కీర్తి నటన తో మెప్పించింది. ఇదేకాకుండా పలు చిత్రాల్లో నటిస్తుంది కీర్తి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కీర్తి తనను ఒకరు పెళ్లిచేసుకోమని అడిగినట్టు చెప్పింది. సాధారణంగా నటీ నటులను ఈ ప్రశ్న అడిగితే ఏ హీరో అయ్యుంటాడో ? లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా అయ్యుంటారేమో అనుకుంటాం. కానీ కీర్తి ని పెళ్లి చేసుకోమని అడిగింది తన వీరాభిమానట.
ఒక పబ్లిక్ ఫంక్షన్లో కీర్తి సురేష్ కు తన అభిమాని ఒక గిఫ్ట్ ఇచ్చాడట, తరువాత అది తెరిచి చూడగా అందులో కీర్తి ఫోటో ఆల్బం ఉందట.. ఆల్బం తో పాటు ఒక లవ్ లెటర్ కూడా ఉందట..ఆ లెటర్ లో తనను పెళ్లి చేసుకోమని అడిగాడట ఆ అభిమాని. కీర్తి కూడా ఆ లెటర్ చాలా భద్రంగా దాచుకుందట..ఎందుకంటే తనకు చదువుకునే రోజుల్లో కానీ, కాలేజీలో కానీ ఎవరు ఆలా లవ్ లెటర్ ఇవ్వలేదట. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మధురానుభూతిని చెప్పుకొచ్చింది కీర్తి.