మిస్‌ ఇండియా ‘అలివేలు మంగ’లా మారనుందా.?

By Inkmantra - March 02, 2020 - 16:10 PM IST

మరిన్ని వార్తలు

‘మహానటి’తో తమిళ, తెలుగు ప్రేక్షకుల అపారమైన అభిమానాన్ని చూరగొన్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌, త్వరలో ‘మిస్‌ ఇండియా’ సినిమాతో రాబోతోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, చాలా సినిమాలతో కీర్తి సురేష్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈలోగా మరో కొత్త ప్రాజెక్ట్‌ కీర్తి తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదే ‘వేంకటరమణ అలిమేలుమంగ’ సినిమా. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌ అలిమేలుమంగ పాత్రకు కీర్తి సురేష్‌ పేరు పరిశీలిస్తున్నారట. టైటిల్‌లో కీలక పాత్ర పోషిస్తున్న అలిమేలుమంగ పాత్రకు సినిమాలోనూ యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా ఉండడంతో, ఆ పాత్రకు మహానటి కీర్తిసురేష్‌ జీవం పోస్తుందని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రచారంపై స్పష్టత రావల్సి ఉంది.

 

‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్‌ ఫుల్‌ లెంగ్త్‌లో (మన్మధుడు 2’లో గెస్ట్‌ రోల్‌ తప్ప) తెలుగులో కనిపించలేదు . త్వరలో రానున్న ‘మిస్‌ ఇండియా’ సినిమాతోనే సందడి చేయనుంది. ఇదే కాక కీర్తి నటించిన ‘పెంగ్విన్‌’ తదితర చిత్రాలూ వరుసగా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో తేజ ప్రాజెక్ట్‌ ఓకే అయితే, కీర్తి ఖాతాలో మరో కొత్త ప్రాజెక్ట్‌ చేరినట్లే. ఇదిలా ఉంటే, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ` క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా కోసం కూడా కీర్తి పేరు పరిశీనలో ఉనంది. చూస్తుంటే, ఓ వైపు రిలీజ్‌ కావల్సిన సినిమాలూ, మరోవైపు కొత్త ప్రాజెక్టులతో కీర్తి డైరీ ఫుల్‌గా ఫిల్‌ అయిపోనుందనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS