కీర్తికి స్వాగ‌తం ప‌లికిన మ‌హేష్‌

By iQlikMovies - October 17, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అధికారికంగా ప్ర‌క‌టించలేదు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. `వెల్ క‌మ్ టు ది బోర్డ్‌` అంటూ ఈ ప్రాజెక్టులోకి కీర్తి సురేష్ కి ఆహ్వానం ప‌లికాడు. కీర్తి సురేష్ లో `స‌ర్కారు వారి పాట‌` మ‌రో మంచి సినిమాగా మిగిలిపోతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు మ‌హేష్‌. ఈ ట్వీట్ తో ... కీర్తి సురేష్ పేరు అధికారికంగా ఖ‌రారుచేసిన‌ట్టైంది.

 

`స‌ర్కారు వారి పాట‌` కోసం అమెరికాలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ వీసాల రాక ఆల‌స్యం అవ్వ‌డంతో.. ఆ షెడ్యూల్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. దాంతో.. ఆ షెడ్యూల్ వాయిదా ప‌డిన‌ట్టే. అయితే సినిమా మాత్రం ఆల‌స్యం అవ్వ‌కుండా.. హైద‌రాబాద్ లోనే షూటింగ్ మొద‌లెట్టాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS