స్టార్ డమ్ సంపాదించుకున్న నాయికలు... కొంతకాలానికి లేడీ ఓరియెంటెడ్ కథలవైపు దృష్టిసారించడం సహజం. అయితే కీర్తి సురేష్ కాస్త తొందరపడి - ముందుగానే అటువైపు అడుగులేసింది. అవి మంచి ఫలితాలనే ఇచ్చాయి. `మహానటి` ఆమె కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ అయ్యింది. ప్రస్తుతం తన చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్ కథలున్నాయి. మరో సినిమా `పెంగ్విన్`గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈనెల 19న అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాని నేరుగా విడుదల చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ వచ్చేశాయి. ఇదో... సైకో థ్రిల్లర్ అనే సంగతి ప్రచార చిత్రాలు చూస్తే అర్థమైపోతున్నాయి. ఓ బిడ్డకు తల్లిగా, మరో బిడ్డకు జన్మనిస్తున్న ఆడదిగా కీర్తి బరువైన పాత్రని పోషిస్తోంది. అమె సీరియస్ లుక్స్ చూస్తుంటే, తన కెరీర్‌లో మరో డిఫరెంట్ పాత్ర ఎంచుకుందని అర్థమౌతోంది. ఈ సినిమాలో సైకోతో కీర్తి పోరాటాలు కూడా చేసిందట. కీర్తిని మహానటి లాంటి హుందా పాత్రల్లో చూశాం. ఇప్పుడు ఫైటింగులు చూడబోతున్నాం. ఈ సడన్ ఛేంజ్ ఓవర్‌ని ప్రేక్షకులు ఎంత వరకూ రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం.