మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `సర్కారు వారి పాట`. కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. ప్రతినాయకుడిగా ఉపేంద్ర నటిస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే ఏమైందో తెలీదు గానీ, సడన్‌గా సుదీప్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఈ కన్నడ స్టార్ 'ఈగ'తో తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరవాత తనకు సరైన పాత్రలు పడలేదు. 'బాహుబలి', 'సైరా'లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తెలుగులో మళ్లీ ఓ శక్తిమంతమైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నాడు సుదీప్. ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చింది. అయితే దర్శక నిర్మాతలకు సుదీప్ రెండో ఆప్షన్ మాత్రమే. ముందు ఉపేంద్రని సంప్రదిస్తారు. ఆయన కాదన్న పక్షంలో... సుదీప్‌ని ఎంచుకుంటారు. మరి ఇద్దరిలో మహేష్ విలన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.