ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇండస్ట్రీకి పరిచయమైన నాటి నుండీ సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది. 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన బ్యూటీ కీర్తి సురేష్. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది నాళ్లలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. తెలుగు, తమిళంలో ఓ రేంజ్‌లో దూసుకెళ్లిపోతోంది అమ్మడి కెరీర్. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటిస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి'.
పవన్ కళ్యాణ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది ఈ బ్యూటీ ఈ సినిమా ద్వారా. కాగా పవన్‌ని ప్రశంసలతో ముంచేస్తోంది. పవన్ స్క్రీన్ మీద ఉన్నదాని కంటే మామూలుగా ఉన్నప్పుడు చాలా సీరియస్‌గా ఉంటారనీ అందరూ అంటుంటారు. చూడడానికే ఆయన అలా కనిపిస్తారు కానీ, సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారనీ కీర్తి సురేష్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఆయనతో కలసి నటించడం చాలా ఆనందంగా ఉందంటోంది. ఆయన ఆటిట్యూడ్ నుండి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానంటోందీ ముద్దుగుమ్మ.
అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ అయిన అనూ ఇమ్మాన్యుయేల్ పవన్ చూపుల గురించి గొప్పగా చెప్పింది. ఆ చూపుల్లోనే ఏదో పవర్ ఉందని ఆమె చెప్పింది. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్ని పవన్ ఇంతలా ఇంప్రెస్ చేసేశాడన్న మాట. ఇక త్రివిక్రమ్ పంచ్‌ల సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్‌కి కీర్తి సురేష్ ఫిదా అయిపోయిందట. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పేసింది. కానీ బయట కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతోందట. అలాగే కొంచెం కొంచెంగా తెలుగు అర్ధం చేసుకుంటోందట కూడా. షూటింగ్ ప్యాకప్ అయినాక రిలాక్స్ టైంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటుండగా, డైలాగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే చాలా సరదాగా అనిపిస్తోందట కీర్తి సురేష్‌కి. అదంతా త్రివిక్రమ్ పంచ్‌ల్లోని ఫన్ పవరే అంటోంది ఈ ముద్దుగుమ్మ.