'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో హీరోయిన్స్ కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ డిఫరెంట్ లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ నార్మల్ నెట్టెడ్ శారీలో గ్లామరస్ లుక్‌లో కనిపించగా, కీర్తి సురేష్ మాత్రం డిఫరెంట్ స్టైల్లో శారీ ధరించి వచ్చింది.
అయితే కీర్తి సురేష్ కాస్ట్యూమ్‌పై రకరకాల కామెంట్స్ వచ్చాయి ఆ తర్వాత. కానీ కెరీర్ మొదట్లోనే చెప్పింది కీర్తి సురేష్ తాను గ్లామర్‌కి దూరంగా ఉంటాననీ, అస్సలు ఎక్స్‌పోజింగ్ చేయనని. ఇంతవరకూ ఆమె అదే ఆటిట్యూడ్‌ని అలాగే కొనసాగించుకుంటూ వచ్చింది. యాక్టింగ్ టాలెంట్‌తోనే అవకాశాల్ని దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ దిశగా ఎదుగుతూ వస్తోంది. అయితే 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్‌కి ధరించిన కాస్ట్యూమ్ సాదా సీదా కాస్ట్యూమ్ కాదంట.
ఆమె ఈ ఫంక్షన్ కోసం ఆ కాస్ట్యూమ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేయించిందట. ఆ కాస్ట్యూమ్ చూడ్డానికి ఓ డిఫరెంట్ స్టైల్లో కట్టిన శారీలా అనిపిస్తోంది. కానీ ఆ కాస్ట్యూమ్‌కి వాడిన పేట్రన్ వెనకాల ఓ కాన్సెప్ట్ దాగుందట. 'స్ట్రాంగ్ ఉమెన్' అనే కాన్సెప్ట్‌తో డిజైన్ చేయించిన కాస్ట్యూమ్ అట అది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తర్వాత చెబుతోంది. అస్సలు ఎక్కడా స్కిన్ కనిపించకుండా, ఏదో వింటర్ స్పెషల్ కాస్ట్యూమ్ అంటూ కామెంట్స్ వచ్చాయి.
వింటర్‌లో చలిని తట్టుకునేందుకు వీలుగా ఉండేలా కీర్తిసురేస్ ఆ కాస్ట్యూమ్ ధరించి ఉండి ఉండొచ్చునంటూ, ఓ పక్క, అప్పుడెప్పుడో ఓ ఫంక్షన్‌లో ముమైత్ ఖాన్ ధరించిన కాస్ట్యూమ్‌లా ఉందంటూ మరో పక్క రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే మన ముద్దుగుమ్మకి యాక్టింగ్ టాలెంట్‌తో పాటు, తెలివితేటలు కూడా కూసింత ఎక్కువే. అందుకే ఆడియో ఫంక్షన్‌కి ధరించే కాస్ట్యూమ్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఎంత కేర్ తీసుకుందో చూశారా.. దటీజ్ కీర్తి సురేష్.