తెరపై ఎలాంటి గ్లామర్నైనా ఒలకబోసేందుకు రెడీ అనే జేజమ్మ అనుష్క, తెర బయట మాత్రం ఎంతో ఒద్దికగా కనిపిస్తుంది. నిండైన వస్త్ర ధారణతో, తేనెలూరే మాటలతో అందర్నీ కట్టిపాడేస్తుంది. అనుష్కలో అంతా మెచ్చుకునే అంశమిదే. రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అంటుంది. ఇప్పుడు తాజాగా ఇదే ఆటిట్యూడ్‌ని కంటిన్యూ చేస్తోంది కీర్తి సురేష్.
బహిరంగ వేడుకల్లో నిండైన వస్త్రధారణతో అనుష్కలాగే క్యూట్‌గా మాట్లాడుతూ కుర్రకారునే కాదు, అన్ని వర్గాలనూ విశేషంగా ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇక్కడ ఓ చిన్న డిఫరెన్స్ అయితే ఉందిలెండి. తెరపై కూడా కీర్తి సురేష్ ఇంతవరకూ హద్దులు దాటలేదు. గ్లామర్‌కి దూరంగానే ఉంది. ఇకపోతే, ఆమె నటించిన 'మహానటి' ఆమెను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. కెరీర్లో ఊహించని మలుపును, గెలుపును అందించింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా, ఆ ప్రభావం ఏదో ఒక రకంగా, ఏదో ఒక మూల నుండి కనిపించేలా చేస్తోంది 'మహానటి' ద్వారా కీర్తి సురేష్.
ఈ తరహా బరువైన పాత్రను కెరీర్ మొదట్లోనే చేసి, విజయం అందుకున్న కీర్తి సురేష్‌కి కెరీర్లో ఎలాంటి పాత్రనైనా డీల్ చేయగలనన్న నమ్మకం వచ్చేసింది. ఆమెకే కాదు, దర్శక, నిర్మాతలకు కూడా బెస్ట్ ఆప్షన్ దొరికింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. కానీ తమిళంలో సూర్యతో ఓ సినిమాలో నటిస్తోంది. సెల్వ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కీర్తి కోసం వెయిటింగ్లో ఉందని తాజా సమాచారమ్.