కథానాయికగా, దర్శకురాలిగా విజయ నిర్మల అందుకున్న శిఖరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ సొంతం చేసుకున్నారామె. ఆమె జీవితంలోనూ ఎన్నో ఎగుడుదిగుడులు, మలుపులు, ఊహకు అందని ట్విస్టులూ ఉన్నాయి. అందుకే విజయ నిర్మల కథ ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ స్టార్ హీరోయిన్ విజయ నిర్మల పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ అవకాశం కీర్తి సురేష్‌కి దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది.
`మహానటి`తో బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది కీర్తి. ఆసినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఓ మంచి ఛాన్స్ ఆమె దగ్గరకు వెళ్లినట్టైంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పైప్ లైన్‌లో ఉందని, లాక్ డౌన్ ఎత్తేశాక... ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.