కీర్తి సురేష్ కి రాజమౌళి ఛాన్స్ ఇస్తాడా?

By iQlikMovies - June 28, 2018 - 12:47 PM IST

మరిన్ని వార్తలు

మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటీమణి కీర్తి సురేష్. సావిత్రిగా కీర్తి ప్రదర్శించిన అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

 

అయితే ఆమె మహానటి విడుదల తరువాత మరే ఇతర చిత్రాలకి తెలుగులో చేయడానికి ఇంకా అంగీకారం తెలపలేదు. దీనికి ముఖ్య కారణం- అంతటి గొప్ప చిత్రం చేశాక తరువాత ఏమి చేస్తే ప్రేక్షకులని మెప్పించగలుగుతానా లేదా అన్న ప్రశ్న. ఇలాంటి తరుణంలో ఆమెకి దర్శకుడు రాజమౌళి రూపంలో ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టుగానే చెప్పొచ్చు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న #RRR చిత్రంలో కీర్తిని ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా తీసుకునే అవకాశం ఉందట. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ, కీర్తి ఎంపిక ఖాయంగానే అనిపిస్తున్నది.

ఇదే గనుక జరిగి కీర్తి ఈ చిత్రంలో నటిస్తే, మహానటి తరువాత ఆమె మరొక ప్రతిష్టాత్మక తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకున్నట్టే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS