తమిళ యువ హీరో జై కి తమిళనాడు పోలీసులు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు టాక్ అఫ్ ది కోలీవుడ్ గా మారిపోయింది.
వివరాల్లోకి వెళితే, నిన్న రాత్రి చెన్నై లోని నుంగంబాకం రోడ్డులో జై తన కారుతో హారన్ కొడుతూ పరిధికి మించి కొడుతూ స్పీడ్ గా వెళ్ళాడు. ఇది గమనించిన పోలీసులు ఆయన కారుని వెంబడించి చివరికి పట్టుకున్నారు. అలా పట్టుకున్నాక తీరా చూస్తే అది హీరో జై అవ్వడంతో పోలీసులు కాస్త అసహనానికి గురయ్యారట.
కారణం ఆయన గత సెప్టెంబర్ లో మద్యం సేవించి కారుని నడుపుతూ ఒక గోడను గుద్దిన కేసులో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించి వాహనం నడుపుతుండడంతో ఆయనని చెన్నై ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.
అదే సమయంలో ఆయన పరిధికి మించి హారన్ కొడుతూ వెళ్ళిన మార్గంలో ఆసుపత్రి ఉండడంతో అందులో ఉండే వారికి ఇబ్బంది కలిగించాడు అన్న అభిప్రాయాన్ని కూడా సదరు పోలీసులు వ్యక్తం చేశారట.
హీరోగా ఉంటున్నప్పుడు ఇలా పదే పదే ట్రాఫిక్ రూల్స్ తప్పుతూ ప్రవర్తించడం వల్ల ఆయన అభిమానులకి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటికైనా జై తన తీరు మార్చుకుంటే మంచిది అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతున్నది.