'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాకే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో అమ్మడికి ఓ మోస్తరు క్రేజ్ ఏర్పడింది. తర్వాత కూడా వరస విజయాలు అందుకుంది. 'మహానటి' సినిమా కీర్తిసురేష్ కెరీర్‌ని పతాక స్థాయిలో నిలబెట్టేసింది. నిజంగానే ఈ సినిమాతో ఈ జనరేషన్ 'మహానటి' అనిపించుకుంది. అంతే, స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. తాజాగా కీర్తిసురేష్ 'మన్మధుడు 2'లో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా గడుపుతోంది కీర్తిసురేష్. ఇదిలా ఉంటే, కీర్తిసురేష్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
నెట్టింట్లో ఈ భామ పెద్దగా హాట్ పిక్స్ పోస్ట్ చేయదే.. అని ఆశ్చర్యపోతున్నారా.? హాట్ పిక్స్ కావివి. స్లిమ్ పిక్స్. కీర్తిసురేష్ తొలి సినిమా నుండీ 'చబ్బీ చీక్స్.. డింపుల్.. కాదులెండి కానీ, క్యూట్ చిన్..' అన్నట్లుగా ముద్దుగా బొద్దుగానే కనిపిస్తూ వచ్చింది. అయితే, తాజా ఫోటోలో కీర్తిసురేష్ బాగా సన్నబడింది. చబ్బీ చీక్స్ అస్సలే లేవు. కీర్తి సురేష్ అంటేనే చబ్బీ చీక్స్.. కానీ అవి ఇప్పుడు మాయమైపోయాయి. వర్కవుట్స్ చేసి, కష్టపడి బాగా స్లిమ్ అయిపోయింది కీర్తిసురేష్. 'సఖి' అనే ఓ సినిమా కోసం కీర్తి ఇలా సన్నగా మారిపోయింది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ దిగిన ఫోటోలే ఇవి. ఈ ఫోటోల్లో కీర్తి సురేష్ అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఎవరీ కొత్త హీరోయిన్ ఇంతందంగా ఉందే.. అనేలా మారిపోయింది. అయితే, ఈ పిక్స్‌కి నెట్టింట్లో మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. బొద్దుగుంటేనే బాగున్నావని కొందరంటే, స్లిమ్ లుక్‌లో కెవ్వుకేక అంటూ ఇంకొందరు.. కీర్తిసురేష్‌ని ప్రశంసిస్తున్నారు.