కీర్తి సురేష్‌కి 'బాహుబలి' బిల్డప్‌

By iQlikMovies - May 04, 2018 - 16:48 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' అంటే ముందుగా గుర్తొచ్చేది భారీ ఏనుగు. ఆ ఏనుగుపై ప్రబాస్‌ నిలబడి ఉన్న పోస్టర్‌. ఇప్పుడు అదే బిల్డప్‌ని 'మహానటి'కిచ్చారు. అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమా కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఏనుగుపై కీర్తి సురేష్‌ కూర్చొని, అభిమానులకు హాయ్‌ చెబుతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే, అందరికీ 'బాహుబలి' సినిమానే గుర్తొస్తోంది మరి.

లేటెస్ట్‌గా సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'మహానటి' 'యు' సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. అతిరధ సినీ మహా ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి, సావిత్రితో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకున్న యంగ్‌స్టర్స్‌ ఆ అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, మోహన్‌బాబు, నాగచైతన్య, షాలినీ పాండే, మాళవికా నాయర్‌ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

యంగ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించారు. మే 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి క్రిటికల్‌ ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేయాలంటే గట్స్‌ ఉండాలి. నాగ్‌ అశ్విన్‌లోని ఆ గట్స్‌నే అంతా మెచ్చుకుంటున్నారు. అయితే సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. అలాంటి ఆమె జీవిత గాధలోని ఏ ఏ ముఖ్య ఘట్టాల్ని నాగి తన సినిమాలో చూపించాడనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS