అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక సినిమా ఎలా ఉందంటే, మిక్స్‌డ్ టాకే వినిపిస్తోంది. కానీ వన్ మేన్ ఆర్మీలా బన్నీ ఈ సినిమాని నడిపించాడనీ తెలుస్తోంది.
రియల్ సైనికుడిలా కనిపించాడు బన్నీ ఈ సినిమాలో. అలా కనిపించేందుకు బన్నీ పడిన కష్టం, డెడికేషన్ అంతా తెరపై స్పష్టంగా కనిపించింది. ఇంతవరకూ బన్నీ చేసిన సినిమాలన్నింట్లోనూ ఈ సినిమాలోని పాత్ర టఫ్ అండ్ ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. సూర్యగా కెరీర్ బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడనీ బన్నీపై పొగడ్తల వర్షం కురుస్తోంది. కానీ ఓవరాల్‌గా సినిమా కథా, కథనాలపై మిక్స్‌డ్ టాకే వినిపిస్తోంది.
ఇకపోతే, హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. అస్సలు ప్రాధాన్యత లేని పాత్ర అనూ ఇమ్మాన్యుయేల్‌ది. దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి, యూత్‌ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. అలాగే యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న బన్నీ ఆ క్రేజ్‌ని నిలబెట్టుకునేందుకు ఈ సినిమాకి వందకు వంద శాతం న్యాయం చేశాడని సినిమా చూసినవారు మాట్లాడుకుంటున్నారు. వాస్తవికతకు అద్దం పట్టే సినిమా అయినా కానీ, కమర్షియల్‌గా కూడా ఆకట్టుకునేలా సినిమాని మలచడంలో దర్శకుడు వక్కంతం వంశీ విజయం సాధించాడు.
యాక్షన్ ఘట్టాలు అంచనాలకు తగ్గట్లుగానే ప్రేక్షకుల్ని కట్టి పాడేశాయి. మొత్తానికి బన్నీ 'నా పేరు సూర్య'తో హిట్ కొట్టేసినట్లే ఉన్నాడు.