'మహానటి' అంటే ఇంతవరకూ అలనాటి మేటి నటి సావిత్రి మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు కీర్తిసురేష్‌ని కూడా తలంపు కు తెచ్చుకోవాలి. ఇటీవల సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం ఆమెకు అంతగా గుర్తింపు తీసుకొచ్చింది. మరో సావిత్రి కీర్తి సురేష్ అని వేనోళ్ల పొగిడించుకుంది.
ఇకపోతే, 'మహానటి' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. కానీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలున్నాయి కోలీవుడ్‌లో. 'సామి 2', 'సందకోళి 2' చిత్రాలతో పాటు, సూర్యతో 'ఎన్‌న్‌జీకే', విజయ్ - మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రంలోనూ కీర్తి నటిస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా మురుగదాస్ - విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి కొన్ని స్టిల్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్‌కి ఓ పక్క సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండగా, మరోపక్క విమర్శలు వస్తున్నాయి. ఒక స్టిల్‌లో కీర్తి సురేష్ సోఫాలో కూర్చుని, కింద కూర్చుని ఉన్న విజయ్ కాలిని తన కాలితో తొక్కి పెట్టి ఉంచడం విజయ్ అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేస్తోందట. అయినా సినిమాలో ఇలాంటివన్నీ చాలా కామన్. కొన్ని కొన్ని సీన్స్‌లో హీరోయిన్, హీరో చెంప పగలగొట్టే సీన్స్ ఉంటాయి. 'కిక్' సినిమాలో ఇలియానా ఓ సీన్‌లో రవితేజని కాలితో తన్నే దృశ్యం ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని అభ్యంతరకర సన్నివేశాలుంటాయి.
సినిమాని సినిమాలాగే చూడాలి. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్‌లో విజయ్ ఓ స్టార్ హీరో, కీర్తి అప్‌కమింగ్ హీరోయిన్ కావచ్చు, కానీ ఓ సినిమాలో కలిసి నటించేటప్పుడు కథకు అనుకూలంగా తమ తమ పాత్రల చిత్రీకరణను బట్టి నటించుకుంటూ వెళ్లిపోవాల్సిందే కదా.!