బిగ్ బాస్ లో హల్చల్ చేస్తున్న బాబు గోగినేని

మరిన్ని వార్తలు

బాబు గోగినేని- తను పాటిస్తూ ప్రచారం చేసే హేతువాదాన్ని ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరికి రుచి చూపిస్తున్నారు. తను చేసే పనులు, ప్రవర్తించే తీరుతో హౌస్ మేట్స్ కి ఈ విషయం మెల్లమెల్లగా అర్ధమవుతున్నది.

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అభిప్రాయం వచ్చే ఉంటది. ఇక నిన్న బిగ్ బాస్ షో లో ఒక టాస్క్ కి సంబంధించి తనకి నచ్చని పని చేయమనందుకు తాను చేయను అని కావాలంటే తనకి డిజ్ లైక్ (టాస్క్ చేయని వారికి ఇస్తారు) ఇవ్వమని చాలా కచ్చితంగా చెప్పేశారు. అదే సమయంలో ఆయనని డాన్స్ చేయమని (టాస్క్ లో భాగంగా) కోరగా ఆయన అంతగా ఇష్టపూర్వకంగా ఆ డాన్స్ చేసినట్టుగా ఏమి కనిపించలేదు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే అందరికన్నా ఈ షో చూసే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. కాని బాబు గోగినేని మాత్రం తనకి నచ్చితేనే చేస్తాను అనే వైఖరి బహుశా ఈ షో కి సరిపోకపోవచ్చు అని సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.

కాకపోతే ఆయన ఈ వారం ఎలిమినేషన్ లో లేకపోవడంతో ఆయన ఇంకొక రెండు వారాల పాటు బిగ్ బాస్ లో ఉండే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంది. చూద్దాం.. బాబు గోగినేని రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండనున్నారో..

కొసమెరుపు: ఈ షో లో పాల్గోనేవారికి సమయం ఎంత అవుతున్నది అనే దాని పైన సమాచారం ఉండదు. కాని ఆయన దానికి సూర్యుడిని దానివల్లే ఏర్పడే నీడని బట్టి తెలుసుకోవచ్చు అని సాటి పోటీదారులకి ఫిజిక్స్ పాఠాలు చెప్పడం విశేషం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS