మహానటితో జాతీయ ఉత్తమ నటి హోదా తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమాతో తన జాతకమే మారిపోయింది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తున్నాయి. `మిస్ ఇండియా` కూడా అలాంటి సినిమానే. నరేంద్రనాథ్ దర్శకుడు. నవంబరు 4న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు.
ఎంబీఏ చదివిన ఓ అమ్మయి, వ్యాపార వేత్త కావాలని కలులు కంటుంది. ఇంట్లో వాళ్లనీ, సంప్రదాయాల్ని ఎదిరించి. వ్యాపారంలో కాకలు తీరిన వాళ్లని ఎదురొడ్డి ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించిందో తెలియాంటే... ఈ సినిమా చూడాల్సిందే. కీర్తికి ఓ కొత్త తరహ ఆపాత్ర దొరికిందన్న భరోసా ట్రైలర్ కలిగిస్తోంది. తన ఈజ్ తో, నటనతో, స్టైల్ తో.. ఈ పాత్రకు కొత్త లుక్ తీసుకొచ్చింది. స్టైలీష్ విలన్‌గా జగపతిబాబు మరోసారి ఆకట్టుకోబోతున్నాడు. ఈమధ్య ఓటీటీలో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. కీర్తి సురేష్‌కీ అలాంటి అనుభవమే ఉంది. మరి ఈ మిస్ ఇండియా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..?