ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్‌ చేయలేకపోయిన 'మహానటి'.!

By Inkmantra - December 10, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

ఈ జనరేషన్‌ 'మహానటి'గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ చేతిలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఆ మాటకొస్తే, దక్షిణాదిలో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్స్‌గా చెలామణి అవుతున్న అతికొద్ది మంది హీరోయిన్స్‌లో కీర్తి సురేష్‌ పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. కాగా కీర్తి లిస్టులో ఉన్న ఓ భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌'. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కార్తి తదితర నటీనటులు నటిస్తున్న ఈ భారీ కాస్టింగ్‌ సినిమాలో కీర్తి సురేష్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మణిరత్నం నిర్మిస్తున్నారు. అయితే, తనకున్న బిజీ షెడ్యూల్స్‌ కారణంగా ఈ సినిమాకి డేట్స్‌ కేటాయించలేకపోతోందట కీర్తి సురేష్‌. దాంతో ఇష్టం లేకున్నా, ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోవల్సి వచ్చిందని తెలుస్తోంది.

 

అంటే, ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి కీర్తి హ్యాండిచ్చేసినట్లే. కీర్తి సురేష్‌ పాత్రలో త్రిష వచ్చి చేరినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఈ సినిమా లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. మరోవైపు కీర్తిసురేష్‌ 'మిస్‌ ఇండియా', 'పెంగ్విన్‌' తదితర చిత్రాల్లో నటిస్తోంది. నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగ్‌దే' చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు, ఈ మధ్యనే ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కూడా దక్కించుకుంది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS