ఈ మధ్య హీరోయిన్లు పీకల్లోతు లవ్‌లో మునిగిపోవడం, కొన్నాళ్లకు ఆ ప్రేమపై మోజు తగ్గి, ఏదో రీజన్ చెప్పి, సింపుల్‌గా బ్రేకప్ చెప్పేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. లవ్ బ్రేకప్సే కాదండోయ్. మ్యారేజ్ రిలేషన్‌షిప్‌నీ అంతే సులువుగా బ్రేకప్ చేసేసుకుంటున్నారు మన అందాల భామలు. అలా ప్రేమించి, పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ తాజాగా తన వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొంది.
'కొత్త బంగారు లోకం' సినిమాతో హీరోయిన్‌గా క్యూట్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు, తర్వాత పలు వివాదాల్లో ఇరుక్కుని కెరీర్ లాస్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగో ఆ వివాదాల నుండి గట్టెక్కి ఈ మధ్యనే 'మిఠాయి పొట్లం' తదితర ఒకటీ, అరా సినిమాల్లో అలా అలా తళుక్కున మెరిసింది. కానీ, పాపని పెద్దగా పట్టించుకోలేదనుకోండి. కెరీర్ సంగతి అటుంచితే, తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌తో గతేడాది డిశంబర్‌లో శ్వేతా బసు వివాహం జరిగింది. వివాహం తర్వాత కొద్ది నెలలు సంతోషంగా సాగిన వీరి వైవాహిక బంధంలో కొన్ని నెలలుగా విబేధాలు తలెత్తడంతో, మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నామని శ్వేతా బసు ప్రసాద్ వెల్లడించింది. అయితే, వివాహ రద్దు తర్వాత, ఈ బ్యూటీ కెరీర్‌లో బిజీ అవుతుందా.? చూడాలిక.